Share News

‘స్థానిక’ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పోటీ

ABN , Publish Date - Oct 17 , 2026 | 12:29 AM

జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పోటీకి సిద్ధమవుతోందని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడు గిడుగు రుద్రరాజు వెల్లడించారు.

‘స్థానిక’ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పోటీ
మాట్లాడుతున్న సీబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు

సీడబ్లూసీ సభ్యుడు రుద్రరాజు

అరసవల్లి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పోటీకి సిద్ధమవుతోందని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడు గిడుగు రుద్రరాజు వెల్లడించారు. శుక్రవారం జిల్లా పర్యటనలో భాగంగా స్థానిక ఇందిరా విజ్ఞాన్‌ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను బరిలోకి దించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం కావాలని సూచించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు, జిల్లా ఇన్‌చార్జి మీసాల సుబ్బన్న, దుప్పట్ల మధుసూదన్‌, డి.గోవింద మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 17 , 2026 | 12:29 AM