సివిల్స్ ర్యాంకర్ రాముకి అభినందన
ABN , Publish Date - Mar 09 , 2026 | 12:16 AM
సివిల్స్‌లో 463వ ర్యాంక్ సాధించిన సౌరోతు రాము తొలిసారిగా ఆదివారం స్వగ్రామం జి.సిగడాం మండలం నడిమివలస రాగా ఆయనకు గ్రామస్థులు ఘన స్వాగతం పలి కారు.
శ్రీకాకుళం, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): సివిల్స్‌లో 463వ ర్యాంక్ సాధించిన సౌరోతు రాము తొలిసారిగా ఆదివారం స్వగ్రామం జి.సిగడాం మండలం నడిమివలస రాగా ఆయనకు గ్రామస్థులు ఘన స్వాగతం పలి కారు. గ్రామ పెద్దలు, యువకులు, ఉద్యోగులు రాజాం చేరుకొని అక్కడి బైక్ ర్యాలీతో పొగిరి, జి.సిగడాం మీదుగా నడిమివలస వరకు ర్యాలీగా వచ్చి హారతులిచ్చారు. ర్యాంకు సాధించి జిల్లాకు, గ్రామానికి, తల్లిదండ్రు లకు మంచి పేరు తీసుకురావడం సంతోషంగా ఉందని గ్రామస్థులు పేర్కొన్నారు. రామును ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని కోరారు.