ఎరువుల పంపిణీలో గందరగోళం
ABN , Publish Date - Jul 11 , 2026 | 12:34 AM
తిర్లంగి గ్రామంలో శుక్రవారం ఎరువుల పంపిణీ సందర్భంగా గందరగోళ పరిస్థితి తలెత్తింది. ఉదయం స్థానిక రైతుసేవా కేంద్రం వద్ద పంపిణీని ప్రారంభించారు.
టెక్కలిరూరల్, జూలై 10 (ఆంధ్రజ్యోతి): తిర్లంగి గ్రామంలో శుక్రవారం ఎరువుల పంపిణీ సందర్భంగా గందరగోళ పరిస్థితి తలెత్తింది. ఉదయం స్థానిక రైతుసేవా కేంద్రం వద్ద పంపిణీని ప్రారంభించారు. క్యూలైన్లు కోసం రైతుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు వచ్చినా పరిస్థితిలో మార్పు కనిపించలేదు. దీంతో పంపిణీని కాసేపు నిలిపేశారు. పోలీసులు, వ్యవసాయ అధికారులు రైతులకు నచ్చజెప్పి... మళ్లీ పంపిణీని ప్రారంభించారు. రైతు సేవా కేంద్రానికి 20 టన్నులు అవసరం ఉండగా... ముందుగా 10 టన్నులు నిల్వ చేసినట్టు ఏడీ శ్రీనివాసరావు తెలిపారు. రైతులకు సరిపడినంత నిల్వలు ఉన్నాయని చెప్పారు. యాప్ ద్వారా పంపిణీ చేస్తున్నందువల్ల అందరికీ అందుతుందని తెలిపారు. తొక్కిసలాటకు అవకాశం ఇవ్వవద్దని రైతులను కోరారు