Share News

రీసర్వే కచ్చితంగా నిర్వహించండి

ABN , Publish Date - Feb 20 , 2026 | 11:42 PM

రీసర్వేను కచ్చితమైన విఽధానాలతో నిర్వ హించాలని ట్రైనీకలెక్టర్‌ పృథ్వీరాజ్‌ తెలిపారు. శుక్రవారం మండలంలోని నీలావతిలో జరుగుతున్న రీసర్వేను అధికారులతో కలిసి పరిశీలించారు.

 రీసర్వే కచ్చితంగా నిర్వహించండి
నీలావతిలో రీసర్వేను పరిశీలిస్తున్న పృథ్వీరాజ్‌

పలాసరూరల్‌, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): రీసర్వేను కచ్చితమైన విఽధానాలతో నిర్వ హించాలని ట్రైనీకలెక్టర్‌ పృథ్వీరాజ్‌ తెలిపారు. శుక్రవారం మండలంలోని నీలావతిలో జరుగుతున్న రీసర్వేను అధికారులతో కలిసి పరిశీలించారు. రీసర్వే జరుగుతున్న సమయంలో భూయజమానులు ఉంటున్నారా లేదా అని అధికారులను ప్రశ్నించారు. కచ్చితంగా భూయజమానులు ఉండాలని, వివాదాలకు తావులేకుండా ప్రామాణికంగా సర్వేను నిర్వహించేలా చర్యలుచేపట్టాలని కోరారు. సర్వేలో భూములు కొలుస్తున్న విధా నం, రికార్డుల్లో ఉన్న వివరాలు, వాటి పూర్వాపరాలు పరిశీలించి కచ్చిత విధానాలతో సర్వేను చేపట్టాని అధికారులకు సూచించారు. భూయజమానుల సందేహాలను నివృత్తి చేయాలని, వారికి సరైన విధానంలో రీసర్వే అంశాలను తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కళ్యాణచక్రవర్తి, వీఆర్వో అప్పలస్వామి, సచివాలయం అధికారులు, రైతులు, భూయజమానులు పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2026 | 11:42 PM