Share News

రైతుల సమక్షంలో రీ సర్వే నిర్వహించండి

ABN , Publish Date - Jul 17 , 2026 | 12:02 AM

రైతుల సమక్షంలోనే భూముల రీసర్వే ప్రక్రియను నిర్వహించాలని కాకినాడ సర్వే శాఖ రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ సీహెచ్‌వీఎన్‌ కుమార్‌ కోరారు.

రైతుల సమక్షంలో రీ సర్వే నిర్వహించండి
ఎచ్చెర్ల: ఎస్‌ఎంపురంలో రీసర్వేను పరిశీలిస్తున్న కుమార్‌:

ఎచ్చెర్ల, జూలై 16(ఆంధ్రజ్యోతి): రైతుల సమక్షంలోనే భూముల రీసర్వే ప్రక్రియను నిర్వహించాలని కాకినాడ సర్వే శాఖ రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ సీహెచ్‌వీఎన్‌ కుమార్‌ కోరారు. గురువారం మండలంలోని ఎస్‌ఎంపురంలో భూముల రీసర్వే తీరును పరిశీ లించి, సర్వేపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వే పారదర్శకంగా జరగాలన్నారు. రైతులతో మాట్లాడి సర్వే తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వీఆర్వోలు, సర్వేయర్లతో సమావేశమై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సర్వే శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జోషిలా, తహసీల్దార్‌ బి.గోపాలరావు, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వేయర్లు దుర్గాప్రసాద్‌, చంద్రశేఖర్‌, డెప్యూటీ ఇన్‌ స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వేయర్‌లు విజయకుమార్‌, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Jul 17 , 2026 | 12:02 AM