Share News

ఐటీడీఏ అధికారుల నిర్లక్ష్యంపై విచారణ చేపట్టండి

ABN , Publish Date - Sep 25 , 2026 | 12:35 AM

గిరిజన పోస్టుమెట్రిక్‌ విద్యార్థులు నలుగురు రైలు ప్రమాదంలో మృతిచెందడం పట్ల దళిత, ఆదివాసీ ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులతో కలిసి నిరసన తెలిపారు.

ఐటీడీఏ అధికారుల నిర్లక్ష్యంపై విచారణ చేపట్టండి
టెక్కలిలో నిరసన తెలుపుతున్న జేఏసీ ప్రతినిధులు

టెక్కలి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): గిరిజన పోస్టుమెట్రిక్‌ విద్యార్థులు నలుగురు రైలు ప్రమాదంలో మృతిచెందడం పట్ల దళిత, ఆదివాసీ ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులతో కలిసి నిరసన తెలిపారు. ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్‌, పీవోల నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ చేపట్టాలని వారు డిమాండ్‌ చేశారు. సంబంధిత వార్డెన్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు చొప్పున పరిహారం అందించాలని కోరారు. దెబ్బలు తగిలి రిమ్స్‌లో చికిత్స పొందుతున్న సాల్మన్‌రాజుకు కార్పొరేట్‌ వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు. డీడీ అన్నందొర వార్డెన్‌పై తూతూమంత్రంగా విచారణ చేసి వెళ్లిపోయారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా కన్వీనర్‌ డి.గణేష్‌, కేఎన్‌పీఎస్‌ అధ్యక్షులు బెలమర ప్రభాకరరావు, కోత ధర్మారావు, చల్లా రామారావు, దినేష్‌, గేదెల రమణమూర్తి, జన్ని సింహాచలం, టి.సూర్యం, గోవిందరావు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మృతుల కుటుంబాలను ఆదుకోవాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వినోద్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. రూ.25లక్షల వంతున ఎక్స్‌గ్రేషియా, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గిరిజన యువకుల కుటుంబాలకు రూ.కోటి వంతున పరిహారం చెల్లించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాబ యోగి డిమాండ్‌ చేశారు.

Updated Date - Sep 25 , 2026 | 12:35 AM