Share News

రాజీయే రాజమార్గం

ABN , Publish Date - Sep 29 , 2026 | 11:59 PM

ఏళ్ల తరబడి కోర్టు కేసులకు మధ్యవర్తిత్వం ద్వారా సులభంగా పరిష్కారం లభిస్తుం దని జిల్లా న్యాయ సేవాధికార సం స్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు.

రాజీయే రాజమార్గం
మాట్లాడుతున్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు

శ్రీకాకుళం లీగల్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఏళ్ల తరబడి కోర్టు కేసులకు మధ్యవర్తిత్వం ద్వారా సులభంగా పరిష్కారం లభిస్తుం దని జిల్లా న్యాయ సేవాధికార సం స్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. స్థానిక న్యాయ సేవా సదన్‌లో మంగళవారం మీడియేషన్‌ 3.0 జాతీయ ప్రచార కార్యక్రమంపై న్యాయవాదులతో సన్నాహక సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. మీడియేషన్‌ 3.0 జాతీయ ప్రచార కార్య క్రమం అక్టోబరు ఒకటి నుంచి డిసెంబరు 31 వరకు నిర్వహిస్తున్నామ న్నారు. కోర్టుకు రాకుం డానే అనేక వివాదాలు ఈ మధ్యవర్తిత్వం ద్వారా ఇంటి వద్దే పరిష్కరిం చుకోవచ్చన్నారు. తక్కువ సమయంలో న్యాయం, కోర్టు ఫీజు తిరిగి రావ డం, ఇరుపక్షాల మధ్య స్నేహ సంబంధాలు కొన సాగడం, మధ్యవర్తిత్వ తీర్పుతో సమాన చట్ట బద్ధత వంటి మేలు చేకూరుతాయని తెలిపారు. సమాజంలో పెరుగుతున్న వివాదాలు ఖర్చు లేకుండా రాజీమార్గం ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. మీడి యేషన్‌ 3.0 లక్ష్యా లను సాధించే దిశలో సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మధ్యవర్తిత్వ ప్యానెల్‌ న్యాయ వాదులు, న్యాయసేవాధికార సంస్థ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2026 | 12:00 AM