పరిశ్రమల స్థాపనతో సంపూర్ణ అభివృద్ధి
ABN , Publish Date - Mar 24 , 2026 | 12:05 AM
: పరిశ్రమల స్థాపనతో సంపూర్ణ అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే, పీయూసీ రాష్ట్ర చైర్మన్ కూన రవికుమార్ అన్నారు.
ఎమ్మెల్యే రవికుమార్
ఆమదాలవలస, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): పరిశ్రమల స్థాపనతో సంపూర్ణ అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే, పీయూసీ రాష్ట్ర చైర్మన్ కూన రవికుమార్ అన్నారు. సోమ వారం కొత్తరోడ్డు అక్కివరం పరిసర ప్రాంతాల్లో ఉత్త రాంధ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఇంటింటికీ వెళ్లి అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశ్రామికాభివృద్ధికి అనుకూలమైన అనకాపల్లి జిల్లాలో రూ.లక్ష కోట్ల పెట్టు బడితో ఇంటిగ్రేటెడ్ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవతో రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన జరుగుతోందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు హనుమంతు బాలకృష్ణ, తాండ్ర హరి, సనపల ఆనంద రావు తదితరులు పాల్గొన్నారు.
గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు
ఆమదాలవలస, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): పట్టణం లోని ఐదో వార్డు అక్కివలసలో గ్రామ దేవత చెవిటమ్మ తల్లిని ఎమ్మెల్యే కూన రవికుమార్ సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ దేవతల ఆశీస్సులతో ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీడీ పీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్, పార్టీ జిల్లా సాధికారిక సభ్యుడు నాగళ్ల మురళీధర్ యాదవ్, మున్సినపల్ మాజీ చైర్‌పర్సన్ తమ్మినేని గీతా విద్యాసాగర్, నాయకుడు తంగి గురయ్య, పలువురు స్థానికులు పాల్గొన్నారు.