Share News

కూటమి ప్రభుత్వంలో సమగ్రాభివృద్ధి

ABN , Publish Date - Aug 18 , 2026 | 11:48 PM

రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం సమగ్రా భివృద్ధి సాధిస్తోందని విజ యనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.

కూటమి ప్రభుత్వంలో సమగ్రాభివృద్ధి
ఎచ్చెర్ల: ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, నేతలు

విజయనగరం ఎంపీ కలిశెట్టి

ఎచ్చెర్ల/జి.సిగడాం, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం సమగ్రా భివృద్ధి సాధిస్తోందని విజ యనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఎచ్చెర్ల, జి.సిగడాం మండ లం ఆనందపురంలో మంగ ళవారం ‘రెండేళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూట మి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవే రుస్తూ, పారదర్శక పాలన అంది స్తోంద న్నారు. తల్లికి వందనం, స్త్రీశక్తి, పింఛన్ల పెంపు, రైతు సంక్షే మం, మౌలిక వసతుల కల్పన వంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఆనందపురంలో పలువురు స్థానికులు తాగు నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆయన దృష్టికి తీసుకు వెళ్లగా వాటర్‌ ట్యాంక్‌ నిర్మా ణంతో పాటు త్వరలో తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటా మని ఎంపీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి, కళింగ కార్పోరేషన్‌ డైరె క్టర్‌ అన్నెపు భువనేశ్వరరావు, కూటమి నేతలు బెండు మల్లేశ్వరరావు, వావిల పల్లి రామకృష్ణ, పైడి ముఖలింగం, చిత్తిరి తిరుపతిరావు, పొగిరి నారాయణరావు, కుమరాపు రవికుమార్‌, వజ్జిపర్తి రఘురాం, బాలబొమ్మ వెంటేశ్వరరావు, బెవర జగన్నాఽథరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 18 , 2026 | 11:48 PM