కూటమి పాలనలో సమగ్రాభివృద్ధి
ABN , Publish Date - Aug 07 , 2026 | 11:46 PM
కూటమి ప్రభుత్వం రెండేళ్లలో రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సమగ్రాభివృద్ధి సాధించిందని రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు.
ఎమ్మెల్యే కూన రవికుమార్
ఆమదాలవలస, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం రెండేళ్లలో రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సమగ్రాభివృద్ధి సాధించిందని రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. ఈ మేరకు శుక్ర వారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఐదేళ్ల వైసీపీ పాలనలో చేత కాని అవగాహన లోపంతో అప్పటి సీఎం జగన్‌రెడ్డి చేష్టలతో రాష్ట్రం పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టబడిందని విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రజలు వైసీపీ పాలనకు చరమగీతం పాడి సీఎం చంద్రబాబు నాయు డు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి బాధ్యతలు అప్పగించారన్నారు. రాష్ట్రంలో సంక్షేమానికి రూ.1.49 లక్షల కోట్లు, అభి వృద్ధి పనులకు రూ. 1.34 లక్షల కోట్లు, రుణాల రీషెడ్యూల్‌కు రూ.8269 కోట్లు, ఉద్యోగుల బకాయిలు రూ.30,849 కోట్లు, గత ప్రభుత్వ పెండింగ్ బిల్లులకు రూ. 1937 కోట్లను ప్రస్తుత ప్రభుత్వం చెల్లించిందన్నారు. వైసీపీ పాలనలో నిలిపివేసిన 85 కేంద్ర పథకాలను పునరుద్ధరించింద న్నారు. సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, యువనేత నారా లోకేష్ రాష్ట్రంలో అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు.