Share News

ఓటరు మ్యాపింగ్‌ పూర్తి చేయండి

ABN , Publish Date - Mar 11 , 2026 | 11:55 PM

ఓటరు మ్యాపింగ్‌ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని ఈఆర్‌వో, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ బి.పద్మావతి అన్నారు.

ఓటరు మ్యాపింగ్‌ పూర్తి చేయండి
మాట్లాడుతున్న ఈఆర్వో పద్మావతి

ఇచ్ఛాపురం, మార్చి 11 (ఆంఽధ్రజ్యోతి): ఓటరు మ్యాపింగ్‌ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని ఈఆర్‌వో, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ బి.పద్మావతి అన్నారు. ఇచ్ఛాపురం లో బుధవారం బీఎల్వోలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఓటరు మ్యాపింగ్‌ విషయంలో నియోజకవర్గం వెనుకబడి ఉందని, ప్రతీ బీఎల్వో శ్రద్ధ తీసుకుని రెండు రోజుల్లోగా 75 శాతం ప్రక్రియ పూర్తి చేయాల న్నారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఇచ్ఛాపురం, కంచిలి, సోంపేట, కవిటి తహసీల్దార్లు వెంకటరావు, రమేష్‌, అప్పలస్వామి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2026 | 11:55 PM