Share News

‘సర్‌’ డిజిటలైజేషన్‌ పూర్తి చేయండి

ABN , Publish Date - Jul 10 , 2026 | 11:52 PM

‘సర్‌’ ప్రక్రియలో భాగంగా చేపట్టిన ఎన్యూమ రేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ ఆదే శించారు.

 ‘సర్‌’ డిజిటలైజేషన్‌  పూర్తి చేయండి
బీఎల్వోలతో మాట్లాడుతున్న జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌

జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌

ఇచ్ఛాపురం, జూలై 10 (ఆంధ్రజ్యోతి): ‘సర్‌’ ప్రక్రియలో భాగంగా చేపట్టిన ఎన్యూమ రేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ ఆదే శించారు. శుక్రవారం లొద్దపుట్టి పంచా యతీలోని 56, 57, 58, 59, 60 పోలింగ్‌ కేంద్రాల్లో జరుగుతున్నఽ డిజిటలైజేషన్‌ ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ఈనెల 14తో ముగు స్తుందని, ఈ నాలుగురోజుల్లోగా బీఎల్వోలు, రెవెన్యూ అధికారులు, సూపర్‌వైజర్లు ప్రత్యేక శ్రద్ధ కనబరిచి డిజిటలైజేషన్‌ శతశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్ల క్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒక్క ఓటు తొలగిపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో తహసీ ల్దార్‌ ఎన్‌.వెంకటరావు, స్పెషల్‌ ఆఫీసర్‌, ఏపీడీ సీహెచ్‌ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

వినతులు స్వీకరించిన జేసీ

సోంపేట రూరల్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): కర్తలిపాలెంలో శుక్రవారం రెండోవిడత నిర్వహిం చిన వన్‌మంత్‌-వన్‌ విలేజ్‌ కార్యక్రమంలో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ పాల్గొన్నారు. గతంలో వచ్చిన వినతులు ఏమేరకు పరిష్కరించారో సం బంధిత అధికారులతో చర్చించారు. అలాగే ప్రజ ల నుంచి వివిధ సమస్యలపై 28 వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో పలాస ఆర్డీవో అప్పలరాజు, సోంపేట తహసీల్దార్‌ అప్పల స్వామి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2026 | 11:52 PM