పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయండి
ABN , Publish Date - Jul 27 , 2026 | 11:57 PM
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయక పోతే దశలవారీగా పోరాటాలు ఉధృతం చేస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు హెచ్చరించారు.
నందిగాం, జూలై 27(ఆంధ్రజ్యోతి): పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయక పోతే దశలవారీగా పోరాటాలు ఉధృతం చేస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు హెచ్చరించారు. ఎన్నికల ముందు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్న ఇచ్ని హామీని రెండేళ్లయినా ఎందుకు అమలు చేయలేదని మంత్రి అచ్చెన్నాయుడును ప్రశ్నించారు. సోమవారం నందిగాం మండలపరి ఽధిలో ఆఫ్‌షోర్ ప్రాజెక్ట్‌ను సీపీఎం ప్రతినిధి బృందంతో పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎన్.షణ్ముఖరావుతో కలిసి గోవిందరావు విలేకరులతో మాట్లాడుతూ ఆఫ్‌షోర్ ప్రాజెక్టు శంకుస్థాపనచేసి 18 ఏళ్లు గడిచినా పూర్తికాలేదన్నారు. ఈప్రాజెక్ట్‌కు రూ.450కోట్లు కేటాయిస్తే పూర్తవుతుందని తెలిపారు. వంశధార బ్యారేజీ ఆధునికీకరణకు రూ.1,500 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు కె.ఎల్లయ్య, ఈశ్వరరావు, బి.వాసుదేవరావు, పి.సాంభమూర్తి పాల్గొన్నారు.