Share News

హోమియోతో సంపూర్ణ ఆరోగ్యం

ABN , Publish Date - Apr 11 , 2026 | 12:02 AM

ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా, దీర్ఘకాలంగా బాధించే మొండి వ్యాధులను సైతం హోమియోపతి వైద్యంతో సమూలంగా నయం చేయవచ్చని జిల్లా ఆయుష్‌ వైద్యాధికారి ఉత్తమ్‌రాజ్‌ రాణా పేర్కొన్నారు.

హోమియోతో సంపూర్ణ ఆరోగ్యం
హానిమన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న దృశ్యం

- ఆయుష్‌ అధికారి ఉత్తమ్‌రాజ్‌ రాణా

అరసవల్లి, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా, దీర్ఘకాలంగా బాధించే మొండి వ్యాధులను సైతం హోమియోపతి వైద్యంతో సమూలంగా నయం చేయవచ్చని జిల్లా ఆయుష్‌ వైద్యాధికారి ఉత్తమ్‌రాజ్‌ రాణా పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ హోమియో వైద్యశాల, పొన్నా డ ఆసుపత్రిలో హోమియోపతి పితామహుడు డాక్టర్‌ శామ్యూల్‌ హానిమన్‌ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి ఉత్తమ్‌రాజ్‌ మాట్లా డుతూ.. జిల్లాలో 16 ప్రభుత్వ హోమియో వైద్యశాలల ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు వినియోగించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. తొలుత హానిమన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మురళీధర్‌, సిబ్బంది చంద్ర శేఖరరావు, రామకృష్ణ, రోజ్‌మేరీ, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

హోమియో వైద్యానికి ఆద్యుడు

కవిటి, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): హోమియో వైద్యానికి ఆద్యుడు శామ్యూల్‌ హానిమన్‌ అని జగతి హోమియో వైద్యాధికారి పి.దుర్గాప్రసాద్‌, వైద్యులు ఎన్‌.దాస్‌, జయప్రకాష్‌ అన్నారు. హానీమన్‌ జయంతి సందర్భంగా శుక్రవారం జగతి గ్రామంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హోమియోపతి ఎంతో విశిష్టమైన వైద్యమన్నారు. సురక్షితం, సమర్థవంతమైన హోమియోపతి చికిత్స పట్ల ప్రజలు అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ పి.వరప్రసాద్‌, గ్రామస్థులు పి.వెంకటేశం, బి.సీతారామ్మూర్తి, బి.నారా యణమూర్తి, పి.జోగయ్య, బి.చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2026 | 12:02 AM