యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
ABN , Publish Date - Jun 20 , 2026 | 12:13 AM
యోగా సాధనతో ఆరోగ్యంగా ఉండొ చ్చని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకూ ర్మంలోని కూర్మనాథ స్వామి ఆలయ ఆవరణలో సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించారు.
జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్
గార, జూన్ 19(ఆంధ్రజ్యోతి): యోగా సాధనతో ఆరోగ్యంగా ఉండొ చ్చని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకూ ర్మంలోని కూర్మనాథ స్వామి ఆలయ ఆవరణలో సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగా మానసిక ఒత్తిడిని దూరం చేస్తుందని, అందువల్ల ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యోగాను ఓ భాగంగా చేసుకోవాలన్నారు. కార్యక్ర మంలో జిల్లా ఆయుష్ అధికారి ఉత్తమ్ రాజ్‌రానా, ఆర్డీవో కె.సాయి ప్రత్యూష, మండల ప్రత్యేకాధికారి డాక్టర్ బాలకృష్ణ, దేవదాయశాఖ ఏసీ ప్రసాద్ పట్నాయక్, జిల్లా పర్యాటక అధికారి ఎన్.నారాయణరావు, ఆలయ ఈవో పి.వాసుదేవరావు, ఎంపీడీవో ఎస్.శ్రీనివాసులు, తహసీ ల్దార్ ఎం.చక్రవర్తి, వివిధ శాఖల సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.
రేపు ప్రపంచ యోగా దినోత్సవం
శ్రీకాకుళం కలెక్టరేట్, జూన్ 19(ఆంధ్రజ్యోతి): కలెక్టరేట్ వద్ద గల డచ్ భవనం ప్రాంగణంలో ఆదివారం ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఉదయం 6.30 గంటలకు ప్రారంభమవు తుందని, అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛం ద సేవా సంస్థలు, విద్యార్థులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.