ఫిర్యాదులను చట్టపరిధిలో పరిష్కరించాలి: ఎస్పీ
ABN , Publish Date - Jan 05 , 2026 | 11:22 PM
పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన వివిధ సమస్యలను పరిశీలించి చట్ట పరిధి లో, నిష్పక్ష పాతంగా, నిర్ణీత కాల పరిమితిలో పరిష్కరించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశిం చారు.
శ్రీకాకుళం క్రైం, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన వివిధ సమస్యలను పరిశీలించి చట్ట పరిధి లో, నిష్పక్ష పాతంగా, నిర్ణీత కాల పరిమితిలో పరిష్కరించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశిం చారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల స్వీక రణ, పరిష్కార వేదికను నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 36 ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. వినతులపై సమగ్ర విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.