Share News

ఫిర్యాదులను పారదర్శకంగా పరిష్కరించాలి

ABN , Publish Date - Mar 25 , 2026 | 12:08 AM

పీజీఆర్‌ఎస్‌కు(ప్రజా సమస్యల పరిష్కార వేదిక) వచ్చే ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి పారదర్శకంగా పరిష్కరించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు.

ఫిర్యాదులను పారదర్శకంగా పరిష్కరించాలి
మాట్లాడుతున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి

ఎస్పీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం క్రైం, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): పీజీఆర్‌ఎస్‌కు(ప్రజా సమస్యల పరిష్కార వేదిక) వచ్చే ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి పారదర్శకంగా పరిష్కరించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలతో సమీక్ష నిర్వహించారు. పరిపాలన, పోలీసు సిబ్బందికి సంబంధించిన అన్ని అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు ఈ-ఆఫీస్‌ విధానం ప్రకారం జరగాలని ఆదేశించారు. సబ్‌ ఇన్‌స్పెక్టర్ల పనితీరును డీఎస్పీ, సీఐ స్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. విజిబుల్‌ పోలీసింగ్‌లో భాగంగా ప్రతిరోజూ గ్రామాలను సందర్శించి ప్రజలతో మమేకం కావాలన్నారు. ముఖ్యకూడళ్లలో నారీశక్తి, సంకల్పం పేరిట మహిళలు, బాలికల భద్రత, మాదక ద్రవ్యాలతో కలిగే అనర్థాలు, సైబర్‌మోసాలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలన్నారు. బాణసంచా తయారీ, విక్రయాలు, నిల్వ కేంద్రాలపై తనిఖీలు నిర్వహించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న నాన్‌బెయిల్‌బుల్‌ వారెంట్లను తక్షణమే అమలు చేయాలని స్పష్టం చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ చర్యల్లో భాగంగా హెల్మెట్‌ధారణపై విస్తృత అవగాహన కల్పించడంతో పాటు డ్రంకెన్‌ డ్రైవ్‌, ఓపెన్‌ డ్రింకింగ్‌పై కేసులు నమోదు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ కేవీ రమణ, డీఎస్పీలు వివేకానంద, లక్ష్మణరావు, గోవిందరావు, జిల్లాలోని ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

Updated Date - Mar 25 , 2026 | 12:08 AM