పాత కక్షలతో దాడి చేశారంటూ ఫిర్యాదు
ABN , Publish Date - Oct 05 , 2026 | 11:34 PM
: పాత కక్షల నేపథ్యంలో తమపై కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారని నందిగాం మండలం కొత్త అగ్రహారం పంచాయతీ జడ్యాడ గ్రామానికి చెందిన రాకోటి సురేష్, తలసముద్రం వసంతరావు, రాకోటి రాజేష్, రాకోటి శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు.
శ్రీకాకుళం క్రైం, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): పాత కక్షల నేపథ్యంలో తమపై కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారని నందిగాం మండలం కొత్త అగ్రహారం పంచాయతీ జడ్యాడ గ్రామానికి చెందిన రాకోటి సురేష్, తలసముద్రం వసంతరావు, రాకోటి రాజేష్, రాకోటి శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డిని బాధితులతో పాటు దళిత సంఘాల జేఏసీ నాయకులు కలిసి సమస్యను వివరించారు. గత నెల 16న రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో రాకోటి సురేష్ పలాసలో టిప్పర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్టు సమాచారం అందడంతో అతడిని తీసుకొచ్చేం దుకు మిగి లిన ముగ్గురు వెళ్లారు. ఈ క్రమంలో మల్లెడ మూడు రోడ్ల జంక్షన్ వద్ద అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తలు పాతకక్షల కారణంగా సురేష్‌తో పాటు తమపై తీవ్రంగా దాడి చేశారని, గాయపడిన తాము పలాసలోని ఆసుపత్రిలో చికిత్స పొందిన తరువాత పోలీసులకు ఫిర్యాదు చేశామ న్నారు. అయితే పోలీసులు ఈ ఘటనను ప్రమాద కేసుగా నమోదు చేశారని, తమపై దాడికి పాల్పడిపై వారిపై చర్యలు తీసుకోలేదని ఎస్పీకి వివరించారు. పరిశీలించి తగుచర్యలు తీసుకోవాలని కోరారు.
‘ప్రతి ఫిర్యాదును బాధ్యతగా పరిష్కరించాలి’
పీజీఆర్‌ఎస్‌లో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి 73 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఫిర్యాదు దారులతో స్వయంగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడుతూ.. ఫిర్యాదులపై చట్టం ప్రకారం విచారణ చేపట్టి త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.