Share News

భర్త అదృశ్యంపై ఫిర్యాదు

ABN , Publish Date - Mar 09 , 2026 | 11:55 PM

తన భర్త కనిపించడం లేదని ఓ భార్య శ్రీకాకుళం రెండో పట్టణ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేసింది.

భర్త అదృశ్యంపై ఫిర్యాదు

శ్రీకాకుళం క్రైం, మార్చి 9(ఆంధ్రజ్యోతి): తన భర్త కనిపించడం లేదని ఓ భార్య శ్రీకాకుళం రెండో పట్టణ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేసింది. టూ టౌన్‌ పోలీసుల కథనం మేరకు.. అంపోలు రెవెన్యూ కాలనీలో నివాసముంటున్న నిక్కు శివకుమార్‌ నగరంలోని ఓ స్వీట్‌ దుకాణంలో పనిచేస్తున్నాడు. ఆయన ఈనెల 3న స్వీట్‌ దుకాణానికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్లలేదు. దీంతో ఆయన భార్య అనూరాధ 3న స్వీట్‌ దుకాణం పరిధిలో గల రెండో పట్టణ పోలీసులను ఆశ్రయించింది. అయితే బంధువుల ఇళ్లల్లో శివకుమార్‌ ఆచూకీ కోసం ఆరా తీసి తెలియజేయాలని పోలీసులు ఆమెకు సూచించారు. దీంతో అనూరాధ తమ బంధువుల ఇళ్లు, తెలిసిన వారి ఇళ్లల్లో భర్త శివకుమార్‌ ఆచూకీ కోసం ఆరా తీసినా ఫలితం లేకపోయింది. దీంతో సోమవారం రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు టూటౌన్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - Mar 09 , 2026 | 11:55 PM