Share News

రోడ్డుకి ఇచ్చిన భూమికి పరిహారం ఇవ్వాలి

ABN , Publish Date - Mar 17 , 2026 | 12:14 AM

రోడ్డు నిర్మాణానికి భూమి ఇచ్చామని, అయితే దానికి పరిహారం ఇవ్వకుండా నిర్మాణం ఎలా చేపడతారని అల్లెన గ్రామానికి చెందిన రైతు ఆలుబిల్లి తవిటినాయుడుతో పాటు మరికొందరు ఆవేదన వ్యక్తంచేశారు.

రోడ్డుకి ఇచ్చిన భూమికి పరిహారం ఇవ్వాలి
రోడ్డు మధ్యలో వేసిన కంచె

బూర్జ, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): రోడ్డు నిర్మాణానికి భూమి ఇచ్చామని, అయితే దానికి పరిహారం ఇవ్వకుండా నిర్మాణం ఎలా చేపడతారని అల్లెన గ్రామానికి చెందిన రైతు ఆలుబిల్లి తవిటినాయుడుతో పాటు మరికొందరు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు సోమవారం రోడ్డుకు అడ్డంగా కర్రలతో అడ్డంగా కంచె ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. వివ రాలిలా ఉన్నాయి.. అల్లెన గ్రామం నుంచి శ్రీకాకుళం ప్రధాన రహదారి వరకు రూ.ఆరు కోట్లతో బీటీ రోడ్డు పను లు ప్రారంభించారు. అయితే ఈ రోడ్డు నిర్మాణానికి సంబం ధించి కొందరు రైతులు భూములను కోల్పోయారు. ఇందులో తనకు చెందిన 56 సెంట్లు రోడ్డులో పడిపోయి పరిహారం ఇవ్వక పోవడంతో హైకోర్టులో పిటిషన్‌ వేసినట్లు తవిటి నాయుడు తెలిపారు. అయినప్పటికీ పనులు చేపడుతుం డడంతో సదరు వ్యక్తితో పాటు మరికొందరు కంచె ఏర్పాటు చేశారు. దీంతో ఆర్‌అండ్‌బీ జేఈ ఆంజనేయులు సోమవారం సదరు ప్రాంతాన్ని పరిశీలించారు. సమస్య పరిష్కారానికి రైతులతో మాట్లాడతామన్నారు. రోడ్డు మధ్య కంచె ఏర్పాటు చేయకూడదన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ తామని పేర్కొన్నారు.

Updated Date - Mar 17 , 2026 | 12:14 AM