Share News

మే 1న బీసీ రిజర్వేషన్లపై కమిషన్‌ క్షేత్రస్థాయి పర్యటన

ABN , Publish Date - Apr 28 , 2026 | 11:52 PM

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు గాను ప్రభుత్వం నియమించిన ‘డెడికేటెడ్‌ కమిషన్‌’ మే 1వ తేదీన జిల్లాలో పర్యటించనుందని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

మే 1న బీసీ రిజర్వేషన్లపై కమిషన్‌ క్షేత్రస్థాయి పర్యటన

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు గాను ప్రభుత్వం నియమించిన ‘డెడికేటెడ్‌ కమిషన్‌’ మే 1వ తేదీన జిల్లాలో పర్యటించనుందని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ రంజన్‌ మిశ్రా అధ్యక్షతన ఏర్పడిన ఈ కమిషన్‌ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వెనుకబాటుతనంపై క్షేత్రస్థాయిలో పరిశోధన చేస్తుందన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కుల సంఘాలు, ప్రజా ప్రతినిధులు, ఆసక్తిగల వ్యక్తుల నుంచి నేరుగా వినతి పత్రాలను స్వీకరిస్తారని, అనంత రం మధ్యాహ్నం 3 గంటల నుంచి కమిషన్‌ బృందం క్షేత్రస్థాయిలో పర్య టిస్తుందన్నారు. జిల్లాలోని బీసీ కులసంఘాల ప్రతినిధులు, మేధా వులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తమ విన్నపాలను రాత పూర్వ కంగా కమిషన్‌కు అందజేయాలని సూచించారు. వినతిపత్రాలు కేవలం స్థానిక సంస్థల్లో బీసీల స్థితిగతులు, రిజర్వేషన్ల శాతానికి సంబం ధించి మాత్రమే పరిమితమై ఉండాలని, ప్రతిపాదనలతో పాటు తగిన సాక్ష్యా ధారాలు, పత్రాల నకళ్లను జత చేయాలని కోరారు. నిర్ణీత సమయంలో కలెక్టరేట్‌కు చేరుకుని కమిషన్‌ ప్రతినిధులను కలిసి తమ సామాజిక వర్గాల వెనుకబాటుతనంపై స్పష్టమైన గణాంకాలు, వాస్తవ వివరాలను సమర్పించాలని సూచించారు.

Updated Date - Apr 28 , 2026 | 11:53 PM