Share News

రాజమ్మ దర్శనానికి వస్తూ..

ABN , Publish Date - Mar 29 , 2026 | 11:51 PM

వత్సవలసలో జరుగు తున్న రాజమ్మ దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించు కునేందుకు వస్తూ శ్రీకూర్మం పంచాయతీ తండ్యాలపేట రోడ్డు జంక్షన్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది.

రాజమ్మ దర్శనానికి వస్తూ..
కనకమ్మ

- రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం

గార, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): వత్సవలసలో జరుగు తున్న రాజమ్మ దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించు కునేందుకు వస్తూ శ్రీకూర్మం పంచాయతీ తండ్యాలపేట రోడ్డు జంక్షన్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. జి.సిగడాం మండలం రామ చం ద్రాపురం అగ్రహారానికి చెందిన ముగడ కనకమ్మ (50) ఆదివారం ఉదయం తన కుమారుడు కవినేష్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై వత్సవలసలోని రాజమ్మ దర్శనానికి వస్తోంది. తండ్యాలపేట జంక్షన్‌ వద్ద ఎదు రుగా వస్తున్న ఆర్టీసీ బస్సు తగిలి ద్విచక్ర వాహనం రోడ్డుపై పడిపోయింది. బైక్‌పై వెనుక కూర్చున్న కనకమ్మ బస్సు వెనక చక్రం తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న వెంటనే గార ఏఎస్‌ఐ టి.చంద్రమోహన్‌, సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతు రాలి కుమారుడు కవినేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. మృతురాలికి భర్త రమణ, ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరంద రికీ వివాహాలు అయ్యాయి. ఇదిలా ఉండగా బైక్‌ నడుపుతున్న కుమారుడు రోడ్డు పక్క తుప్పల్లో పడిపోవడంతో ఎటువంటి గాయాలు తగలలేదు.

Updated Date - Mar 29 , 2026 | 11:51 PM