గాలికోసం ఫుట్‌పాత్ వద్దకు వచ్చి..
ABN , Publish Date - Mar 29 , 2026 | 11:52 PM
పలాస రైల్వే పోలీసు స్టేషన్ పరిధి సున్నాదేవి రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం సాయంత్రం రైలు నుంచి జారిపడి ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాకు చెందిన లాభముని(40) అనే వ్యక్తి మృతి చెందా డు.
- రైలునుంచి జారిపడి వ్యక్తి మృతి
పలాస, మార్చి 29(ఆంధ్రజ్యోతి): పలాస రైల్వే పోలీసు స్టేషన్ పరిధి సున్నాదేవి రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం సాయంత్రం రైలు నుంచి జారిపడి ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాకు చెందిన లాభముని(40) అనే వ్యక్తి మృతి చెందా డు. లాభమునితో పాటు మరో ముగ్గురు వ్యక్తులు ఓఖా వెళ్లేందుకు గంజాం రైల్వే స్టేషన్‌లో పూరి-ఓఖా సూపర్‌ఫాస్ట్ రైలు ఎక్కారు. జనరల్ బోగీలో ప్రయాణిస్తున్న వీరు తీవ్ర ఎండల కారణంగా ఉక్కపోత కావడంతో గాలి కోసం ఫుట్‌పాత్ వద్దకు వచ్చారు. అక్కడ కింద కూర్చొని ప్రయాణిస్తున్న లాభముని సున్నాదేవి రైల్వేస్టేషన్ సమీపంలో తూలిపడి రైలు కింద పడిపోయాడు. రైలును నిలుపుదల చేసి క్షతగాత్రుణ్ని పలాస రైల్వే ఆసుపత్రికి తరలించడానికి తీసుకువచ్చారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.