Share News

ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి తరలిరండి

ABN , Publish Date - Jul 27 , 2026 | 11:54 PM

భోగాపురం ఎయిర్‌ పోర్టు ప్రారంభోత్సవ సభకు తరలిరావాలని నియో జకవర్గ పరిశీలకురాలు బిడ్డక పద్మావతి, ఏఎంసీ చైర్మన్‌ బగాది శేషగిరి కోరారు. సోమవారం టెక్కలిలో టీడీపీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు హనుమంతు రామకృష్ణ, కోళ్ల లవకుమార్‌, కోళ్ల కామేసు, దల్లి ప్రసాద్‌రెడ్డి, పోలాకి షణ్ముఖరావు, మామిడి రాము పాల్గొన్నారు.

 ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి తరలిరండి
టెక్కలి: మాట్లాడుతున్న బిడ్డక పద్మావతి:

టెక్కలి, జూలై 27(ఆంధ్రజ్యోతి): భోగాపురం ఎయిర్‌ పోర్టు ప్రారంభోత్సవ సభకు తరలిరావాలని నియో జకవర్గ పరిశీలకురాలు బిడ్డక పద్మావతి, ఏఎంసీ చైర్మన్‌ బగాది శేషగిరి కోరారు. సోమవారం టెక్కలిలో టీడీపీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు హనుమంతు రామకృష్ణ, కోళ్ల లవకుమార్‌, కోళ్ల కామేసు, దల్లి ప్రసాద్‌రెడ్డి, పోలాకి షణ్ముఖరావు, మామిడి రాము పాల్గొన్నారు.

పీఎం సభకు భాగస్వామ్యం కావాలి: ఎంపీడీవో

నందిగాం, జూలై 27(ఆంధ్రజ్యోతి): భోగాపురంలో ఆగస్టు ఒకటో తేదీన నరేంద్ర మోదీ ప్రారంభించనున్న విమానాశ్రయ సభకు అధికారులు భాగస్వామ్యం కావాలని ఎంపీడీవో యు.కుమార్‌పట్నాయక్‌ ఒక ప్రకటనలో కోరారు. మండలస్థాయి అధి కారులు, పంచాయతీ ప్రత్యేకాధికారులు, స్వర్ణగ్రామ కార్యాలయాల సిబ్బందితో కార్య క్రమంపై చర్చించి జనసమీకరణకు సూచనలు, సలహాలు ఇవ్వాలని పేర్కొన్నారు.

ఫజలుమూరు, జూలై 27 (ఆంధ్రజ్యోతి) భోగాపురంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభను విజయవంతం చేయాలని ఎంపీడీవో బి.చిన్నమ్మడు పిలుపునిచ్చారు. సోమవారం జలుమూరులో టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో డిప్యూటీ ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, వెలుగు ఏపీఎం హేమసుందరరావు, టీడీపీ మండలాధ్యక్షుడు వెలమల రాజేంద్రనాయుడు, కన్వీనరు బగ్గు గోవిందరావు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అధ్యక్షులు తర్ర బలరాం, సొసైటీ అధ్యక్షులు దుంగ స్వామిబాబు, వెలమల చంద్రభూషణరావు పాల్గొన్నారు.

ఉద్దానం ముగ్గులతో మోదీకి స్వాగతం: ఏపీఎం

హరిపురం, జూలై27(ఆంధ్రజ్యోతి): భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానా శ్రయం ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధాని మోదీకి ఉద్దానం ముగ్గులతో స్వాగతం పలకనున్నట్లు ఏపీఎం పి.కూర్మారావు తెలిపారు. సోమవారం మందసలోని ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ఇళ్ల ముందు రంగువల్లులు వేసి ఫొటోలు తీసి ఇన్‌స్ట్రాగాంలో పోస్టుచేసి తమ స్వాగత సుమాంజలి పలుకుతున్నట్లు తెలియజేశారు.

Updated Date - Jul 27 , 2026 | 11:54 PM