Share News

గడువులోగా కలెక్టరేట్‌ పనులు పూర్తి చేయాలి

ABN , Publish Date - May 28 , 2026 | 12:37 AM

నూతనం గా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ పనులను గడువు లోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

గడువులోగా కలెక్టరేట్‌ పనులు పూర్తి చేయాలి
పనులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, మే 27(ఆంధ్రజ్యోతి): నూతనం గా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ పనులను గడువు లోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాంప్లెక్స్‌ ప్రధాన ద్వారం వద్ద పనులు, పార్కింగ్‌ ఏరియా, పాద చారుల కోసం ఏర్పాట్లు చేస్తున్న టైల్స్‌ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని, కాంప్లెక్స్‌ ఆవరణలో ఎక్కడా వర్షపు నీరు నిల్వ ఉండ కుండా కాలువలోకి వెళ్లేలా శాశ్వత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వాహనదారుల కోసం విశాల మైన పార్కింగ్‌ ఏరియాను అందుబాటులోకి తేవాలన్నా రు. దూరప్రాంతాల నుంచి వచ్చే డ్రైవర్లకు పార్కింగ్‌, ప్రత్యేక విశ్రాంతి గదులు, ఆధునిక కెఫె టేరియాతో పాటు, మరుగుదొడ్లను నిర్మించాలన్నారు. నాణ్యతా ప్రమా ణాలు పాటిస్తూ నిర్దేశిత సమయంలోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

‘ప్రజలకు ఉత్తమ సేవలందించాలి’

శ్రీకాకుళం కలెక్టరేట్‌, మే 27 (ఆంధ్ర జ్యోతి): క్షేత్రస్థాయిలో ప్రజలకు ఉత్తమ సేవ లందించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుం డ్కర్‌ ఆదేశించారు. జిల్లాలోని సచివాల యాల డిజిటల్‌ అసిస్టెంట్లతో ఆర్‌ఓఆర్‌ సర్వీసులపై బుధవారం జడ్పీ సమావేశ మందిరంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సకాలంలో విధు లకు హాజరు కావాలన్నారు. డిజిటల్‌ అసి స్టెంట్లకు డివిజన్‌ స్థాయిలో ఈనెల 30న శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామ న్నారు. సమావేశంలో డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, జడ్పీ సీఈవో ఆర్‌.వెంకట్రామన్‌, డీపీవో స్వరూపారాణి, సర్వే, ల్యాండ్‌ ఏడీ జోషిలా తదితరులు పాల్గొన్నారు.

‘పెన్షన్లు శతశాతం పంపిణీ చేయాలి’

జిల్లాలో పెన్షన్లు శతశాతం పంపిణీ చేయాలని కలె క్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ సమా వేశ మందిరంలో ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవో లతో పింఛన్ల పంపిణీపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పింఛన్ల పంపిణీలో ఆలస్యం ఎందుకు జరుగుతోందని ఆరా తీశారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 28 , 2026 | 12:37 AM