Share News

కలెక్టరేట్‌ పనులు వేగవంతం చేయాలి

ABN , Publish Date - Apr 03 , 2026 | 12:16 AM

ee

కలెక్టరేట్‌ పనులు వేగవంతం చేయాలి
అమరావతి రాజధాని బిల్లు ఆమోదించడంతో కలెక్టరేట్‌లో సంబరాల్లో పాల్గొన్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ :

శ్రీకాకుళం కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): జిల్లా కలెక్టరేట్‌ ప్రాంగ ణంలో నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్‌ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ కోరారు. గురువారం జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించారు. కార్యాలయా ల్లో ఏసీ అమరిక పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన పను లను పూర్తిచేయాలని, ప్రతీ అంతస్తులోనూ అదనంగా సిబ్బందిని నియ మించి వేగవంతం చేయాలన్నారు. నిర్ణీత గ డువులోగా భవనాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు.

ప్రభుత్వ సేవలపై నమ్మకం కలగాలి

ప్రభుత్వ సేవలపై ప్రజలకు మరింత నమ్మకం కలిగేలా, సానుకూల దృక్పథం పెంపొందేలా పనిచేయాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన క్షేత్రస్థాయిలో సేవలను మరింత వేగవంతం చేసేలా సచివాలయ సిబ్బం దికి దిశానిర్దేశం చేశారు. జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌తో కలిసి వివిధ శాఖల పనితీరును పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందాలని, తద్వారా పరిపాలనలో జిల్లాను ఆదర్శంగా నిలపాలని కోరారు.

అమరావతికి చట్టబద్ధతపై హర్షం

శ్రీకాకుళం, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్‌లో బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందడంపై కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర సుస్థిరతకు, ప్రగతికి, అభివృద్ధికి కొత్త నాంది అని ఆయన కొని యాడారు. బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో గురువారం కలెక్టరేట్‌ ఆవరణలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌తో కలిసి ఆయన కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ పృథ్వీరాజ్‌ కుమార్‌, డీఆర్వో విశ్వేశ్వరరావు, డీఎస్‌వో సూర్యప్రకాష్‌, పంచాయతీ రాజ్‌ ఎస్‌ఈ వీరన్నాయుడు, జిల్లా ఉపాధి అధికారి కె.సుధ, గనులశాఖ డీడీ మోహ నరావు, ఏవో సూర్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2026 | 12:16 AM