రీసర్వేకోసం రైతుల వివరాలు సేకరణ
ABN , Publish Date - Feb 09 , 2026 | 11:36 PM
రీసర్వేలో తప్పులు జరగకుండా రెవెన్యూ అధికారుల బృందం పలు గ్రామాల్లో రైతుల వివరాలు సేకరిస్తోంది.
పలాసరూరల్, ఫిబ్రవరి9(ఆంధ్రజ్యోతి): రీసర్వేలో తప్పులు జరగకుండా రెవెన్యూ అధికారుల బృందం పలు గ్రామాల్లో రైతుల వివరాలు సేకరిస్తోంది. సోమవారం మండలంలోని లొద్దభద్ర పంచాయతీలోని రైతుల వివరాలు సేకరిం చి తప్పులు ఉంటే సరిదిద్దడంతోపాటు పేర్లు మార్పులు ఉంటే వాటి వివరాలను నమోదుచేశారు. పెదంచల పంచాయతీ మరదరాజపురంలో రైతులతో మాట్లాడి వారి వివరాలు సేకరించారు. రీసర్వే చేస్తున్న భూముల యజమానుల వివరాల ను సేకరించి తప్పులను సరి చేశారు. కార్యక్రమంలో డీటీ గిరి, వీఆర్వోలు చంద్ర మోహన్, కళ్యాణి, అసిస్టెంటు సర్వేయర్లు పాల్గొన్నారు.