Share News

1,600 మట్టి నమూనాల సేకరణ

ABN , Publish Date - Feb 03 , 2026 | 11:14 PM

మండలంలో ఈ ఏడాది 1,600 మట్టి నమూనాలు సేకరించి వాటి లోపాలను తెలుసుకునేందుకు ఆమదాలవలస పరీక్ష కేంద్రానికి పంపిస్తామని ఏవో కె.సింహాచలం తెలిపారు.

  1,600 మట్టి నమూనాల సేకరణ
మట్టినమూనాలు సేకరిస్తున్న వ్యవసాయశాఖ సిబ్బంది

పాతపట్నంరూరల్‌, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): మండలంలో ఈ ఏడాది 1,600 మట్టి నమూనాలు సేకరించి వాటి లోపాలను తెలుసుకునేందుకు ఆమదాలవలస పరీక్ష కేంద్రానికి పంపిస్తామని ఏవో కె.సింహాచలం తెలిపారు. వచ్చిన ఫలితాలను సకాలంలో రైతులకు అందించి లోపాలకు అనుగుణంగా ఎరువులు యాజమాన్యం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు.మండలంలోని గంగువాడలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంట నమోదులో రైతు వివరాలు నమోదుపై రైతుసేవా కేంద్రం ద్వారా తెలు సుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సిరిపురం గంగాధర్‌, గిరి ధర్మా రావు, మధుసూదనరావు, గ్రామవ్యవసాయ సహాయకులు మహేష్‌, ప్రకృ తి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 03 , 2026 | 11:14 PM