Share News

చలి కోట్లు లేక అవస్థలు

ABN , Publish Date - Jan 01 , 2026 | 11:44 PM

కోటబొమ్మాళిలో ప్రభుత్వం పారిశుధ్య కార్మికులకు విధి నిర్వహణ సమయంలో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో అగచాట్లకు గురవుతున్నారు. ప్రధానంగా ప్రస్తుతం శీతాకాలానికి అనుగుణంగా కోట్లు లేకపోవడంతో చలిగాలులకు వణి కిపోతూ విధులు నిర్వహిస్తున్నారు.

చలి కోట్లు లేక అవస్థలు
కోటబొమ్మాళి రెడ్డికవీధిలో చలి కోట్లు ధరించకుండా చెత్త ఎత్తుత్తున్న పారిశుధ్య కార్మికులు:

కోటబొమ్మాళి, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): కోటబొమ్మాళిలో ప్రభుత్వం పారిశుధ్య కార్మికులకు విధి నిర్వహణ సమయంలో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో అగచాట్లకు గురవుతున్నారు. ప్రధానంగా ప్రస్తుతం శీతాకాలానికి అనుగుణంగా కోట్లు లేకపోవడంతో చలిగాలులకు వణి కిపోతూ విధులు నిర్వహిస్తున్నారు. కొద్దిరోజులుగా జిల్లా వ్యాప్తంగా రాత్రి పూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్న విషయం విదితమే. ఇక్క డ పారిశుధ్య కార్మికులు మాత్రం కోడి కూయకముందే ఎముకల కొరికే చలిలో విధులునిర్వహిస్తున్నారు. పంచాయతీ పరిధిలోని కోటబొమ్మాళితో పాటు బంజీరుపేట, మంచాలపేట, సీతన్నపేట, ఉప్పరపేటలో 14 వార్డు ల్లో వారికి కేటాయించిన ప్రదేశాలకు చేరుకొని చెత్తను తొలగించి శుభ్రంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధానంగా పంచాయతీలో 30 వేల మంది జనాభాకు 20 మంది పారిశుధ్య కార్మికులు మాత్రమే విధులు నిర్వహిస్తు న్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా కార్మికులు సరిపోకపోవడంతో తెల్లవారుజామునే విధుల్లోకి రావల్సివస్తోందని వారంతా వాపోతున్నారు. అప్రాన్‌ దుస్తులు, రెయిన్‌కోట్లు, బూట్లు, మాస్కులు పంపిణీ చేయకపో వడంతో కార్మికులు వణుకుతునే చెత్తను ఊడ్చుతున్నారు.తమ కష్టాలను ఎవరూ పట్టించుకోవడం లేదని కార్మికులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగాపారిశుధ్యకార్మికులకు రెగ్యులర్‌ దుస్తులు, ఉపకరణాలు, కాస్మటిక్స్‌ను త్వరలోనే అందజేస్తామని, వారికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని పంచాయతీ కార్యదర్శి చింతాడ సన్యాసిరావు తెలిపారు.

Updated Date - Jan 01 , 2026 | 11:44 PM