Share News

నందిగాంలో అమ్మవార్లకు చల్లదనం

ABN , Publish Date - May 20 , 2026 | 12:00 AM

నందిగాంలోని పొందరలు మంగళవారం అమ్మ వార్లకు చల్లదనం చేశారు. మహిళలు కలశాలతో మేళతాళాల మధ్య ఊరేగింపుగా వెళ్లి నీలమణిదుర్గ, సందెమ్మతల్లి ,చింతపోలమ్మతల్లి, సామాలమ్మతల్లి అమ్మవార్లకు ముర్రాటలు సమర్పించి మొక్కులు తీర్చుకొన్నారు.

 నందిగాంలో అమ్మవార్లకు చల్లదనం
హిరాపురంలో మామిడి కాయల పండుగ నిర్వహిస్తున్న దృశ్యం

నందిగాం, మే 19(ఆంధ్రజ్యోతి): నందిగాంలోని పొందరలు మంగళవారం అమ్మ వార్లకు చల్లదనం చేశారు. మహిళలు కలశాలతో మేళతాళాల మధ్య ఊరేగింపుగా వెళ్లి నీలమణిదుర్గ, సందెమ్మతల్లి ,చింతపోలమ్మతల్లి, సామాలమ్మతల్లి అమ్మవార్లకు ముర్రాటలు సమర్పించి మొక్కులు తీర్చుకొన్నారు.

అసిరిపోలమ్మతల్లి అనుపు పండుగ

నందిగాం మండలంలోని ప్రతాపవిశ్వనాధపురం పంచాయతీ చెరుకుపల్లిలో అసిరిపోలమ్మతల్లి గ్రామదేవత ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారి అనుపుపండుగ జరిగింది. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రఽథంపై పూజారి ఆశీనులై మహిళలు సమర్పించిన ముర్రాటలు, మొక్కులను స్వీకరించి దీవెనలు అందించారు. ఈ సందర్భంగా కాళీమాత డాన్స్‌, మహిళల కోలాటం, కోయడ్యాన్స్‌ సోముగారిడి తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి నెలకొంది.

Updated Date - May 20 , 2026 | 12:00 AM