జనవాసాల్లో నాగుపాము కలకలం
ABN , Publish Date - Aug 04 , 2026 | 11:02 PM
స్థానిక శ్రీనివాసనగర్ కాలనీలో మంగళవారం సా యంత్రం 10 అడుగుల పొడవు ఉన్న భారీ నాగుపాము జనవాసాల్లోకి ప్రవేశించింది.
పలాస, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): స్థానిక శ్రీనివాసనగర్ కాలనీలో మంగళవారం సా యంత్రం 10 అడుగుల పొడవు ఉన్న భారీ నాగుపాము జనవాసాల్లోకి ప్రవేశించింది. దీన్ని చూసి స్థానికులు ఆందోళన చెందారు. స్నేక్‌క్యాచర్ ఓంకార్‌త్యాడికి స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడికి చేరుకొని పామును అతికష్టంపై బంధించారు. అనంతరం దాన్ని పట్టణ శివారులో ఉన్న మెండు అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. సాధారణంగా నాగుపాము అయిదు నుంచి ఏడు అడుగుల పొడవు ఉంటుంది. కానీ శ్రీనివాసనగర్‌లో కనిపించిన ఈ పాము 10 అడుగుల పొడవు ఉండడం విశేషం.