పేదలకు అండగా కూటమి పాలన
ABN , Publish Date - Feb 03 , 2026 | 11:16 PM
పేదలకు అండగా నిలిచేలా కూటమి ప్రభుత్వపాలన సాగుతోందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు.
పాతపట్నం, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): పేదలకు అండగా నిలిచేలా కూటమి ప్రభుత్వపాలన సాగుతోందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. మంగళవారం పాతపట్నం క్యాంపు కార్యాలయంలో ఎల్‌ఎన్‌పేట మండలంలోని గొట్టిపల్లికు చెందిన రావాడ పుష్పలతకు రూ. 56,309, మెళియాపుట్టి మండలంలోని మర్రిపాడుకుచెందిన ఉంగ గోపాలరావుకు రూ. 78,967ల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు.