Share News

చేనేతకు కూటమి ప్రభుత్వం చేయూత

ABN , Publish Date - Apr 01 , 2026 | 11:56 PM

రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల మగ్గాలకు 200 యూనిట్లకు ఉచితంగా విద్యుత్‌ అందించే పథకాన్ని బుధవారం నుంచి అమలు చేస్తున్నారు.

చేనేతకు కూటమి ప్రభుత్వం చేయూత
శ్రీకాకుళం రూరల్‌: చేనేత కార్మికుడికి కరపత్రం అందించి అవగాహన కలిగిస్తున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌

రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల మగ్గాలకు 200 యూనిట్లకు ఉచితంగా విద్యుత్‌ అందించే పథకాన్ని బుధవారం నుంచి అమలు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాలో ఈ పథకం అమలు పత్రాలను ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు అందించారు.

నేత కార్మికులకు సాయం: ఎన్‌ఈఆర్‌

లావేరు, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం చేయూత అందిస్తోందని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. బుధవారం అప్పాపురంలో చేనేత కార్మికుల మగ్గాలకు ప్రభుత్వం అమలు చేసిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పఽథకం అమలు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. అర్హులైన చేనేత కార్మికులకు పింఛన్లు, తుఫాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తోందన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ముప్పిడి సురేష్‌, మాజీ సర్పంచ్‌ గంట్యాడ మహేష్‌, ట్రాన్స్‌కో ఏఈ కె.అప్పన్న తదితరులు పాల్గొన్నారు.

నేతన్నలకు ఉచిత విద్యుత్‌ భరోసా: శంకర్‌

శ్రీకాకుళం రూరల్‌, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చేనేత రంగానికి కొత్త ఊపిరి పోస్తూ కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ పథకం అమలు చేస్తోందని, ఇందులో భాగంగా 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా అందిస్తోందని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. బుధవారం సింగుపురం పంచాయతీలో చేనేత కార్మికులను కలిసి విద్యుత్‌ మంజూరు పత్రాలను అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచిం చారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

చేనేత పరిశ్రమ సంస్కృతికి ప్రతీక: ఎంజీఆర్‌

పాతపట్నం, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): చేనేత పరిశ్రమ మన సంస్కృతి, సంప్ర దాయాలకు ప్రతీక అని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. చేనేత మగ్గాలకు నెలకు 200 యూని ట్ల ఉచిత విద్యుత్‌ బుధవారం నుంచి ప్రభుత్వం అమలు చేస్తున్న నేపథ్యంలో కాగువాడ వస్త్రపురి కాలనీలో చేనేత కార్మికులతో సమావేశం నిర్వహించారు. అనంతరం చేనేత కార్మికులు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్ర పటానికి పాల అభిషేకం చేశారు. కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘ నాయ కుడు మంచు కృష్ణారావు, జిల్లా చేనేత సహాయ సంచాలకుడు జనార్దనరావు, ఎంపీడీవో హెచ్‌వీ రమణమూర్తి, సర్పంచ్‌ నల్లి జగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 01 , 2026 | 11:56 PM