Share News

‘ఉపాధ్యాయులకు న్యాయం చేసిన కూటమి ప్రభుత్వం’

ABN , Publish Date - Jul 01 , 2026 | 12:15 AM

పాత పింఛనును తమకు వర్తింపజేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని డీఎస్సీ-2003 ఫోరం ప్రతినిధులు అన్నారు.

‘ఉపాధ్యాయులకు న్యాయం చేసిన కూటమి ప్రభుత్వం’
నందిగాం: మంత్రి అచ్చెన్నాయుడును సత్కరించిన ఉపాధ్యాయులు

కోటబొమ్మాళి/నందిగాం, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): పాత పింఛనును తమకు వర్తింపజేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని డీఎస్సీ-2003 ఫోరం ప్రతినిధులు అన్నారు. ఈ మేరకు మంగళవారం నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును వీరు మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. వేలాది మంది ఉద్యోగుల ఆకాంక్షను నెరవేర్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. మొత్తం సుమారు 11,750 మంది ఉద్యోగులకు పాత పింఛను విధానం అమలు చేసేలా కృషి చేసిన మంత్రి అచ్చెన్నా యుడుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్సీ- 2003 ఫోరం రాష్ట్ర కన్వీనర్‌ బలగ శ్రీనివాసరావు, శ్రీకాకుళం జిల్లా కో-కన్వీనర్‌ అట్టాడ తిరు మలేశ్వరరావు, ఎస్‌వీ రమణరాజు, అల్లాడ బాలకృష్ణ, సీహెచ్‌ జయరాం, కృష్ణారావు, అశ్విని తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 01 , 2026 | 12:15 AM