పేదలకు కూటమి ప్రభుత్వం ఆసరా
ABN , Publish Date - Mar 03 , 2026 | 11:54 PM
పేదలకు కూటమి ప్రభుత్వం ఆసరాగా ఉంటోందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు.
పాతపట్నం/ఎల్.ఎన్.పేట, మార్చి 3(ఆంధ్రజ్యోతి): పేదలకు కూటమి ప్రభుత్వం ఆసరాగా ఉంటోందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. మంగళవారం పాతపట్నంలోని క్యాంపుకార్యాలయంలో ఎల్‌ఎన్‌పేట మండలంలోని పెద్దకొల్లివలసకుచెందిన భైరి యశోదమ్మకు రూ.70,322ల సీఎంఆర్‌ఎఫ్ చెక్కును అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి నిరుపేద తమకు ఆపద కాలంలో ఆదుకొనేందుకు కూటమిప్రభుత్వం ఉందనే భరోసా వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు వి.గోవిందరావు, జి.రాము, జి.గణేష్‌కుమార్, టి.భద్రయ్య, ఎ.జోగారావు పాల్గొన్నారు.