నేడు సీఎం పర్యటన
ABN , Publish Date - May 16 , 2026 | 12:12 AM
'Swarnandhra-Swachhandhra' in Narasannapet ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం జిల్లాలో పర్యటించను న్నారు. నరసన్నపేటలో నిర్వహించనున్న ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొ నున్నారు. స్వయంగా పారిశుఽధ్య పనులను పర్యవేక్షించి ప్రజల్లో చైతన్యం నింపనున్నారు.
నరసన్నపేటలో ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గోనున్న చంద్రబాబు నాయుడు
ప్రజలతో ముఖాముఖి
పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం
పకడ్బందీగా ఏర్పాట్లు
కేంద్ర, రాష్ట్రమంత్రులు పరిశీలన
పోలీసుల భారీ బందోబస్తు
శ్రీకాకుళం/ నరసన్నపేట, మే 15 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం జిల్లాలో పర్యటించను న్నారు. నరసన్నపేటలో నిర్వహించనున్న ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొ నున్నారు. స్వయంగా పారిశుఽధ్య పనులను పర్యవేక్షించి ప్రజల్లో చైతన్యం నింపనున్నారు. ఐదు గంటలపాటు ఇక్కడే ఉండనున్నారు. నరసన్నపేటలో ప్రజావేదికలో స్థానిక సమ స్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించను న్నారు. వేదికపై ప్రసంగించనున్నారు. అనంతరం సర్ణాంధ్ర- స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా నరసన్నపేట పట్టణ శివారులో చెత్తసంపద కేంద్రం (ఎస్‌డబ్ల్యూపీసీ)లో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్‌ను ప్రారంభిస్తారు. తామరాపల్లిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో కార్యకర్తలు, టీడీపీ నాయకులతో సమీక్షిస్తారు.
ఏర్పాట్లు పూర్తి
సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తిచేశామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుం డ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామన్నారు. సుమారు 1,300 మంది పోలీసులు, మరో 200 మంది ఇతర సిబ్బందితో బందోబస్తు సిద్ధం చేశామని తెలిపారు. ఏర్పాట్లను శుక్ర వారం కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శి బగ్గు అర్చన, జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ తదితరులు పరిశీలించారు.
షెడ్యూల్ ఇలా :
సీఎం చంద్రబాబునాయుడు శనివారం ఉదయం 9 గంటలకు ఉండవల్లిలో తన నివాసం నుంచి బయలుదేరి.. హెలీకాప్టర్‌లో 10.40 గంటలకు తామరాపల్లిలో హెలీప్యాడ్‌వద్దకు చేరుకుంటారు.
నరసన్నపేటలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ప్రసంగిస్తారు.
మధ్యాహ్నం 1.20 గంటలకు నరసన్నపేటలో ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్ వద్ద స్థానిక ప్రజలతో సమావేశమవుతారు. అక్కడ పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించడంతోపాటు, స్థానిక సమస్యలు, అభివృద్ధిపై ప్రజల వినతులు స్వీకరిస్తారు.
మధ్యాహ్నం 2.10 నుంచి 3.40 వరకు తామరాపల్లిలో జిల్లా పార్టీ కేడర్‌తో ప్రత్యేకంగా సమావేశమవుతారు. భవిష్యత్ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు.
మధ్యాహ్నం 3.55 గంటలకు తామరాపల్లి నుంచి బయలుదేరి 5.35 గంటలకు ఉండవల్లి చేరుకుంటారు.
సీఎం కాన్వాయ్‌లో వాహనాల తగ్గింపు
సీఎం కాన్వాయ్‌లో వాహనాలను తగ్గించనున్నారు. కాన్వాయ్‌లో గతంలో 21 వాహనాలు ఉండేవి. సీఎం చంద్రబాబునాయుడు సూచన మేరకు నేడు నరసన్నపేటలో పర్యటనకు మాత్రం సీఎంవో అధికారులు, సీఎం వ్యక్తిగత భద్రత సిబ్బంది నాలుగు వాహనాలకు మాత్రమే అనుమతించారు. భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ మహేశ్వరరెడ్డితో సీఎం వ్యక్తిగత భద్రత అధికారులు చర్చించారు.