సీఎం పర్యటనను విజయవంతం చేయాలి
ABN , Publish Date - May 08 , 2026 | 12:46 AM
మఖ్యమంతి చంద్రబాబు ఈనెల 16న నరసన్నపేట పట్టణంలో పర్యటన నేపధ్యంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహారించి అన్ని ఏర్పాట్లు పక్కాగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అధికారులను సూచించారు.
ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
నరసన్నపేట, మే 7(ఆంధ్రజ్యోతి): మఖ్యమంతి చంద్రబాబు ఈనెల 16న నరసన్నపేట పట్టణంలో పర్యటన నేపధ్యంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహారించి అన్ని ఏర్పాట్లు పక్కాగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అధికారులను సూచించారు. గురువారం స్థానిక ఆర్‌అండ్‌బీ బంగ్లాలో వివిధ శాఖల అఽధికారులతో సమీక్షించారు. నరసన్నపేట మేజర్ పంచాయతీ పరిధిలో పారిశుధ్యం, రహదారుల మరమ్మతులు, విద్యుత్ అలంకరణలు, తాగునీటి సౌకర్యాలు వంటి పనులు వేగవంతంగా చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురైతే వెంటనే ఎంపీడీవోను సంప్రదించి పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శి బగ్గు అర్చన, జెడ్పీ సీఈవో ఆర్.వెంకట్రామన్, డీపీవో స్వరూపరాణి, డీఎల్‌పీవో గోపిబాల తదితరులు పాల్గొన్నారు.