సీఎం పర్యటనను విజయవంతం చేయాలి
ABN , Publish Date - May 07 , 2026 | 12:30 AM
ముఖ్యమం త్రి చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పిలుపునిచ్చారు.
నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
నరసన్నపేట, మే 6(ఆంధ్రజ్యోతి): ముఖ్యమం త్రి చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పిలుపునిచ్చారు. నరసన్నపేట పట్టణంలో ఈనెల 16న ముఖ్యమంత్రి చంద్రబాబు స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పర్యటించనున్న నేపథ్యంలో బుధవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో పట్టణ క్యాడర్‌తో ఎమ్మెల్యే సమీక్షించారు. సీఎం పర్యటనకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. ప్రతీ వార్డులో అఽధికారులతో సమన్వయం చేస్తూ కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. ఒక్కొక్క వార్డుకు ప్రత్యేకాధికారులను నియమించడం జరిగిందన్నారు. స్వచ్ఛ నరసన్నపేట సాధన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శి బగ్గు అర్చన, పొందర కార్పొరేషన్ చైర్మన్ దామోదరం నర్సింహులు, పార్టీ నాయకులు జామి వెంకట్రావు, శిమ్మ చంద్రశేఖర్, కింజరాపు రామారావు, అడపా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.