పేదలకు వరం ‘సీఎం సహాయ నిధి’
ABN , Publish Date - Jan 03 , 2026 | 12:03 AM
ఆపదలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ఒక వరమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
కోటబొమ్మాళి, జనవరి 2(ఆం ధ్రజ్యోతి): ఆపదలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ఒక వరమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం స్థానిక ఎన్టీఆర్ భవనంలో టెక్కలి నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన 31మంది బాధితులకు రూ.17,22,027 విలువైన చెక్కులను అందజేశారు. ని యోజకవర్గంతో ఇప్పటి వరకు 254 దరఖాస్తులు రాగా ముఖ్యమంత్రి చంద్ర బాబు సహకారంతో 218 మందికి రూ.2,39,71,485 విలువైన చెక్కులు మంజూ రు చేయించానని మంత్రి వివరించారు. మరో 12 దరఖాస్తులు పది రోజుల్లో సిద్ధమవుతాయని, ఇటీవల పంపిన మరికొన్ని దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయన్నారు. టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కింజ రాపు హరివరప్రసాద్. నాయకులు బోయిన రమేష్ తదితరులు పాల్గొన్నారు.