Share News

పాలన.. ప్రగతిపై నేడు సీఎం దిశానిర్దేశం

ABN , Publish Date - Jan 12 , 2026 | 12:12 AM

CM's Meeting today at amaravathi రాష్ట్ర అభివృద్ధి, పరిపాలనా వ్యవహారాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధక్షతన సోమవారం కీలక సమావేశం జరగనుంది. అమరావతి వేదికగా ‘హానరబుల్‌ మినిస్టర్స్‌ అండ్‌ సెక్రటరీస్‌ కాన్ఫరెన్స్‌’ పేరుతో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ సమావేశం నిర్వహించనున్నారు.

పాలన.. ప్రగతిపై నేడు సీఎం దిశానిర్దేశం

అమరావతిలో మంత్రులు, కార్యదర్శుల ఉన్నతస్థాయి భేటీ

వర్చువల్‌ విధానంలో హాజరుకానున్న కలెక్టర్‌

ఆదాయ వనరులు, భూ సమస్యలు, కేంద్ర పథకాలే ప్రధాన అజెండా

శ్రీకాకుళం, జనవరి 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అభివృద్ధి, పరిపాలనా వ్యవహారాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధక్షతన సోమవారం కీలక సమావేశం జరగనుంది. అమరావతి వేదికగా ‘హానరబుల్‌ మినిస్టర్స్‌ అండ్‌ సెక్రటరీస్‌ కాన్ఫరెన్స్‌’ పేరుతో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ వర్చువల్‌ విధానంలో పాల్గొననున్నారు. జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాల అమలు తీరుపై సమీక్షించనున్నారు.

రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు.. రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్‌డీపీ) వృద్ధి రేటు, పాలనలో ‘పది సూత్రాల’ అమలుపై ప్రణాళికా శాఖ ప్రజెంటేషన్‌ ఇవ్వనుంది. కేంద్ర పథకాలకు సంబంధించి ప్రభుత్వ ఆదాయ వనరులు, ఆదాయాన్ని ఆర్జించే శాఖల పనితీరు, కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్‌ఎస్‌) పురోగతిపై ఆర్థిక శాఖ సమీక్ష నిర్వహిస్తుంది. అలాగే రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడి ప్రతిపాదనలు, పీపీపీ ప్రాజెక్టుల పురోగతిపై పరిశ్రమల శాఖ నివేదిక ఇస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల పరిష్కార స్థితిగతులు, ఆన్‌లైన్‌ సేవలు, వాట్సాప్‌ గవర్నెన్స్‌, ప్రభుత్వంపై ప్రజల సానుకూలత తదితర అంశాలపై ఐటీ శాఖ సమీక్షించనుంది. పట్టాదార్‌ పాస్‌పుస్తకాల పంపిణీ, భూ సర్వే సమస్యలు, రెవెన్యూ ఫిర్యాదుల పరిష్కారం, రిజిస్ట్రేషన్‌ సేవలు, ఆస్తుల భద్రత(బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ) అంశాలపై రెవెన్యూ శాఖ ప్రత్యేక చర్చ జరపనుంది. ఉపాధి హామీ పథకం, గ్రామీణ జీవనోపాధి మిషన్‌, వికసిత్‌ భారత్‌ లక్ష్యాలపై సమీక్షించనున్నారు. సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, అధికారులకు భవిష్యత్‌ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అవసరమైన సమాచారంతో సమీక్షకు సన్నద్ధమైంది.

Updated Date - Jan 12 , 2026 | 12:12 AM