Share News

సీఎంఆర్‌ఎఫ్‌తో పేదలకు భరోసా

ABN , Publish Date - May 30 , 2026 | 11:45 PM

సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు భరోసాగా నిలుస్తోం దని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. నిరుపేదకు అండగా కూటమిపాలన సాగుతోందని చెప్పారు

  సీఎంఆర్‌ఎఫ్‌తో పేదలకు భరోసా
సీఎంఆర్‌ఎఫ్‌ ఎల్‌ఓసీ పత్రాన్ని అందజేస్తున్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

పాతపట్నం, మే 30(ఆంధ్రజ్యోతి): సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు భరోసాగా నిలుస్తోం దని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. నిరుపేదకు అండగా కూటమిపాలన సాగుతోందని చెప్పారు. శనివారం పాతపట్నంలోని క్యాంపు కార్యాలయంలో కీర్తి సరస్వతికి రూ.మూడు లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ ఎల్‌ఓసీ పత్రాన్ని అందజేశారు. రౌతులక్ష్మీపురం గ్రామానికి చెందిన సరస్వతి తీవ్ర అనారోగ్యానికి గురై వైద్య సేవల నిమిత్తం ఎమ్మెల్యేను ఆశ్రయించింది. దీంతో ఎమ్మెల్యే చొరవచూపి సీఎంఆర్‌ఎఫ్‌ ఎల్‌ఓసీ పత్రాన్ని ఆమెకు మంజూరుచేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదోడి భరోసాగా సీఎంఆర్‌ఎఫ్‌ నిలుస్తోందన్నారు. గతంలో వైసీపీ పాలనలో ఏ నాడూ పేదోడి బాధలను పట్టించుకొనే దాఖలాలులేవన్నారు.

Updated Date - May 30 , 2026 | 11:45 PM