సీఎంఆర్‌ఎఫ్‌తో బాధితులకు భరోసా: మంత్రి
ABN , Publish Date - Aug 09 , 2026 | 11:24 PM
ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్)తో బాధితులకు ఆర్థిక భరోసా ఉంటోందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ఒక్క టెక్కలి నియోజకవర్గంలోనే ఇప్పటి వరకు 441 మందికి రూ.4.83 కోట్లు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందించినట్టు తెలిపారు
కోటబొమ్మాళి/టెక్కలి/మెళియాపుట్టి, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్)తో బాధితులకు ఆర్థిక భరోసా ఉంటోందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ఒక్క టెక్కలి నియోజకవర్గంలోనే ఇప్పటి వరకు 441 మందికి రూ.4.83 కోట్లు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందించినట్టు తెలిపారు ఆదివారం స్థానిక ఎన్టీఆర్ భవనంలో టెక్కలి నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన 44 మందికి రూ. 22,83,053 విలువైన చెక్కులను అందజేశారు. గ్రామాల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు అందుబాటులో లేక సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న అర్హులైన వారి వివరాలను గుర్తించి అవసరమైన దరఖాస్తులు, వైద్య పత్రాలను సేకరించి సమర్పించాలని పార్టీ కార్యకర్తలకు మంత్రి సూచించారు.
ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన మై టీడీపీ యాప్‌లో నమోదు చేయాలన్నారు. ప్రజల కోసం పని చేస్తున్న కార్యకర్తలకు ప్రభుత్వం, పార్టీ నాయకత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బగాది శేషు, మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్, దేశం నేతలు కర్రి అప్పారావు, నంబాళ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా... ఆర్‌ఎస్‌రెడ్డి సంస్థ ఆధ్వర్యంలో రూపిందించిన సాంకేతిక విజ్ఞానం-పర్యావరణం అనే పుస్తకాన్ని స్థానిక ఎన్టీఆర్ భవనంలో మంత్రి అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు.
కార్యకర్తల సంక్షేమం ముఖ్యం
నందిగాం, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): కార్యకర్తల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ భరోసా ఇస్తుందని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నందిగాం, కాపుతెంబూరు గ్రామాలకు చెందిన అడపా చిన్నవాడు, కోమటూరు ప్రసాద్‌లకు టీడీపీ బీమా మంజూరైంది. దీంతో చిన్నవాడు భార్య అడప దాలమ్మ, ప్రసాద్ భార్య సంతోష్ కుమార్‌లకు రూ.ఐదు లక్షల చెక్కులను ఆదివారం కోటబొమ్మాళి ఎన్టీఆర్ భవన్‌లో మంత్రి అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పి.అజయ్‌కుమార్, పి.జోగారావు, ఎం.బాలకృష్ణ, బి.శివ, బారికి, కె.సతీష్‌కుమార్ తదితరులు ఉన్నారు.