Share News

పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ ఆసరా: ఎన్‌ఈఆర్‌

ABN , Publish Date - Jan 06 , 2026 | 11:49 PM

పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ ఆసరాగా ఉంటోందని, వారికి వరమని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు తెలిపారు.

పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ ఆసరా: ఎన్‌ఈఆర్‌
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేస్తున్న నడుకుదిటి ఈశ్వరరావు:

రణస్థలం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ ఆసరాగా ఉంటోందని, వారికి వరమని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు తెలిపారు. మంగళవారం రణస్థలంలోని క్యాంపుకార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.25,655 చెక్కును బుడుమూరు గ్రామానికి చెందిన కుప్పిలి సింహాచలానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 18 నెలల కాలంలో ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో 123 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.1.45 కోట్ల పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయ కులు దన్నాన సురేష్‌, రవి, సూర్యారావు, సాయి పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2026 | 11:49 PM