Share News

సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు వరం

ABN , Publish Date - Apr 12 , 2026 | 11:47 PM

ముఖ్యమంత్రి సహాయనిధి నిరు పేదలకువరమని(సీఎంఆర్‌ఎఫ్‌), పేద కుటుంబాలు వైద్యంకోసం దరఖాస్తు చేసిన వెంటనే సీఎం నిధులు మంజూరు చేస్తున్నారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు.

  సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు వరం
చెక్‌ను అందజేస్తున్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

రణస్థలం, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి సహాయనిధి నిరు పేదలకువరమని(సీఎంఆర్‌ఎఫ్‌), పేద కుటుంబాలు వైద్యంకోసం దరఖాస్తు చేసిన వెంటనే సీఎం నిధులు మంజూరు చేస్తున్నారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. ఆదివారం రణస్థలంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో తొమ్మిది మందికి రూ.10 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు, అవసరాల్లో ఉన్నవారికి ప్రభుత్వం సహాయం తక్షణమే అందేలా కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందన్నారు. కార్య క్రమంలో నాయకులు డీజీఎం ఆనందరావు, ముప్పిడి సురేష్‌, ఎం కనకారావు, పిషిని జగన్నాఽథంనాయుడు, శ్రీనివాసరావు, దుమ్ము అశోక్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2026 | 11:47 PM