నిరుపేదలకు సీఎంఆర్‌ఎఫ్ వరం
ABN , Publish Date - Sep 24 , 2026 | 12:13 AM
నిరుపేదలకు సీఎంఆర్‌ఎఫ్ ఒక వరమని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం పలువురు లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే గొండు శంకర్
శ్రీకాకుళం అర్బన్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): నిరుపేదలకు సీఎంఆర్‌ఎఫ్ ఒక వరమని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం పలువురు లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని 58 మందికి రూ.41.26 లక్షల విలువైన చెక్కులు అందజేశామన్నారు. పేదల వైద్య అవసరాలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంద న్నారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.
పేదలకు అండ: ఎన్‌ఈఆర్
రణస్థలం, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): పేద కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు సీఎంఆర్‌ఎఫ్ అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. బుధవారం కొవ్వాడ, జీరుపాలేం తదిత తీర ప్రాంత గ్రామాల్లో పర్యటించి బాధిత కుటుంబ సభ్యులకు సీఎంఆర్‌ఎఫ్ చెకులుఉ పంపిణీ చేశా రు. ఈదురుగాలుల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.