సీఎం సహాయ నిధితో పేదలకు మేలు: మంత్రి అచ్చెన్న
ABN , Publish Date - May 25 , 2026 | 12:07 AM
: సీఎం సహాయనిధి ద్వారా పేదలు, వివిధ అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారికి మేలు జరుగుతుందని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
కోటబొమ్మాళి/టెక్కలి, మే 24(ఆంధ్రజ్యోతి): సీఎం సహాయనిధి ద్వారా పేదలు, వివిధ అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారికి మేలు జరుగుతుందని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. టెక్కలి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నలుగురురికి సీఎం సహాయం నిధి చెక్కులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదివారం పంపిణీ చేశారు. పి.తులసిలక్ష్మికి రూ.64,579, ఎం.మహాలక్ష్మికి రూ.61,529, ఎస్.విమల కుమారికి రూ.66,280లు, పి.శివసాయికి రూ.50,019 విలువైన చెక్కులను అందజేశారు. నిమ్మాడలోని తన క్యాంపు కార్యాలయంలో వీటిని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలకమండలి సభ్యులుగా నియమితుడైన గణపతి శర్మ ఆదివారం మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
పేదలకు భరోసా...
పాతపట్నం మే 24 (ఆంధ్రజ్యోతి): నిరుపేదలకు అండగా సీఎం సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) నిలుస్తోందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఇద్దరికి రూ.55,126 సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. ఎల్‌ఎన్‌పేట మండలం యంబారం గ్రామానికి చెందిన వాన తేజమ్మకు రూ. 30,028, యూళ్ల ఉగాదమ్మకు రూ.25,166 చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు, ఎమ్మెల్యే మామిడి గోవందరావులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి నిరుపేదకు ఆసరాగా నిలవాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో బాధితుల కుటుంబీకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.