పేదలకు అండగా సీఎం సహాయనిధి
ABN , Publish Date - Feb 04 , 2026 | 11:11 PM
పేదలకు అండగా సీఎం సహాయనిధి ని లుస్తుందని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరా వు అన్నారు.
- ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు
రణస్థలం/ఎచ్చెర్ల, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యో తి): పేదలకు అండగా సీఎం సహాయనిధి ని లుస్తుందని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరా వు అన్నారు. బుధవా రం తన క్యాంప్ కార్యా లయంలో ఇబ్రహీం బాద్, కుప్పిలి, ఫరీద్ పేట తదితర గ్రామా లకు చెందిన 20 మంది లబ్ధిదారులకు రూ.20.75లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 19 నెలల్లో ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో 132 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ 1.66 కోట్లు అందించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఫరీద్‌పేట సర్పంచ్ కొత్తకోట పూర్ణచంద్రరావు, కూటమి నేతలు పైడి ముఖలింగం, కొత్తకోట అమ్మినాయుడు, లంక శ్యామలరావు, ముప్పిడి సరేష్, కొమరాపు రవి, పిన్నింటి భానోజినాయుడు తదితరులు పాల్గొన్నారు.