‘గుండ’ విగ్రహ ఏర్పాటుకు సీఎం హామీ
ABN , Publish Date - Jan 26 , 2026 | 11:53 PM
దివంగత మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారా యణ కుటుంబానికి టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీఎం చంద్ర బాబు భరోసా ఇచ్చారు.
పాతశ్రీకాకుళం జనవరి26 (ఆంధ్రజ్యోతి): దివంగత మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారా యణ కుటుంబానికి టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీఎం చంద్ర బాబు భరోసా ఇచ్చారు. మంగళగిరిలో గుండ కుమారులు శివగంగాధర్, విశ్వనాథ్ సోమవారం సీఎంను కలిసి తమ తండ్రి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. విదేశీ పర్యటన వల్ల తాను అంత్యక్రియలకు రాలేకపోయానని సీఎం విచారం వ్యక్తం చేశారు. తండ్రి ఆశయ సాధన కోసం తాము స్థానికంగానే ఉంటామని వారు చెప్పగా సీఎం హర్షం వ్యక్తం చేశారు. కాగా గుండ కాంస్య విగ్రహ ఏర్పాటు చేయాలని వారు వినతిపత్రం అందించగా ప్రభుత్వపరంగా తగు చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.