రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా సీఎం చంద్రబాబు కృషి
ABN , Publish Date - Jun 20 , 2026 | 11:54 PM
రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా సీఎం చంద్రబాబు నాయుడు శ్రమిస్తున్నారని, ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ సహక రించాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శనివారం తూలుగు గ్రామంలో ‘స్వచ్ఛాం ధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమం నిర్వహించారు.
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ పుండ్కర్, ఎమ్మెల్యే శంకర్
గార, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా సీఎం చంద్రబాబు నాయుడు శ్రమిస్తున్నారని, ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ సహక రించాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శనివారం తూలుగు గ్రామంలో ‘స్వచ్ఛాం ధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమం నిర్వహించారు. అలాగే అంగన్ వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ లను నెరవేరుస్తూ మరో వైపు అభివృద్ధి కార్యక్రమాలను అమ లు చేయడం జరుగుతోం దన్నారు. రైతు, మహిళా, ఇతర అన్ని వర్గాల సంక్షేమం కోసం విధ్వంసం నుంచి అభి వృద్ధివైపు అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తయిందన్నారు. రానున్న మూడేళ్లలో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పయనింపజేసేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్ప నకు రాష్ర్టానికి వివిధ పెద్ద కంపెనీలను ఆహ్వానించడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు సహకారంతో అందరూ మెచ్చేలా ఆదర్శ వంతమైన నియోజకవర్గాన్ని తీర్చిదిద్దేం దుకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే రహదారుల అభివృద్ధి, తాగునీటి సదు పాయం, సాగునీటి కాలువల అభివృద్ధి చేప ట్టమన్నారు. అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నా రులకు అందిస్తున్న పౌష్టికాహారం, ఇతర సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు. కార్య క్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఆర్డీవో సాయి ప్రత్యూష, డీపీవో స్వరూపా రాణి, ఐసీడీఎస్ పీడీ సువర్ణ, సీడీపీవో శోభారాణి, మండల ప్రత్యేకాధికారి డాక్టర్ బాలకృష్ణ, ఎంపీడీవో శ్రీనివాసులు, తహసీల్దార్ చక్రవర్తి, మాజీ సర్పంచ్ కొయ్యాన జగదీష్, పీఏసీఎస్ అధ్యక్షుడు కొయ్యాన చంద్ర శేఖర్, వివిధ శాఖల అధికారులు, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.