9న జిల్లాకు సీఎం చంద్రబాబు రాక
ABN , Publish Date - Apr 25 , 2026 | 11:41 PM
CM Chandrababu Naidu.. visit ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన ఖరారైంది. మే 9న ఆయన జలుమూరు మండలం అక్కురాడ గ్రామం లో పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మీ భూమి - మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొనున్నారు.
అక్కురాడలో ‘మీ భూమి - మీ హక్కు’ కార్యక్రమం
రైతులకు రాజముద్రతో పాస్‌పుస్తకాల పంపిణీ
శ్రీకాకుళం, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన ఖరారైంది. మే 9న ఆయన జలుమూరు మండలం అక్కురాడ గ్రామం లో పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మీ భూమి - మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొనున్నారు. రైతు లకు, భూహక్కుదారులకు ‘రాజముద్ర’తో కూడిన పాస్‌పుస్తకాలను పంపిణీ చేస్తారు.
గత ప్రభుత్వ అరాచకాలకు చెక్
గత ప్రభుత్వం రాష్ట్రంలో రెవెన్యూ వ్యవ స్థను పూర్తిగా అస్తవ్యస్తం చేసింది. అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఫొటోలు ముద్రించేం దుకు సర్వే రాళ్లపై రూ.కోట్లలో ప్రజాధనా న్ని వృథా చేశారు. సామాన్య ప్రజల జిరా యితీ భూములను సైతం ఇష్టానుసారంగా, అస్తవ్యస్తంగా రీ-సర్వేల పేరుతో గందర గోళానికి గురిచేసి.. వివాదాస్పద ‘22ఏ’ (నిషేధిత జాబితా)లో చేర్చేశారు. దీనికి తోడు ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ తీసుకొచ్చి ప్రైవేట్ భూములను లాగేసుకునే కుట్రకు
తెర లేపారు. అలా స్వాధీనం చేసుకున్న భూములను అప్పటి నాయ కులకు, వారి అనుచరులకు కట్టబెట్టారు. ఈ దుర్మార్గాలను సరిదిద్ది, రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించేలా ప్రస్తుత కూటమి ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగానే అధికారం చేపట్టగానే వివాదా స్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేసింది. భూ యజమానులకు, రైతులకు తమ ఆస్తులపై పూర్తి భరోసా, హక్కు కల్పించేలా ‘మీ భూమి - మీ హక్కు’ అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో భాగంగానే అక్కురాడలో ముఖ్యమంత్రి.. రైతులకు పక్కా పాస్ పుస్తకాలను పంపిణీ చేయను న్నారు. సీఎం పర్యటన ఖరారు కావడంతో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది.